తొలిసారి వెండితెరపై తండ్రీకూతుళ్లు

వెండితెరపై చిరంజీవి-రామ్ చరణ్ ను చూశాం. నాగార్జున-అఖిల్-నాగచైతన్యను కూడా చూసేశాం. మహేష్-గౌతమ్ ను కూడా చూశాం. మరి రాజశేఖర్ ను తన కూతుళ్లతో సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తాం? ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. తన కొత్త సినిమాలో కూతురితో కలిసి నటించారు రాజశేఖర్. రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రంగా వస్తోంది ‘శేఖర్’. ఓ మలయాళీ సూపర్ హిట్టు సినిమాకు రీమేక్ ఇది. ఇందులో రాజశేఖర్ కూతురిగా శివానీ రాజశేఖర్ నటించింది. ఈ తండ్రీకూతుళ్ల […]

Advertisement
Update:2022-01-10 14:44 IST

వెండితెరపై చిరంజీవి-రామ్ చరణ్ ను చూశాం. నాగార్జున-అఖిల్-నాగచైతన్యను కూడా చూసేశాం. మహేష్-గౌతమ్ ను కూడా చూశాం. మరి రాజశేఖర్ ను తన కూతుళ్లతో సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తాం? ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. తన కొత్త సినిమాలో కూతురితో కలిసి నటించారు రాజశేఖర్.

రాజశేఖర్ కెరీర్ లో 91వ చిత్రంగా వస్తోంది ‘శేఖర్’. ఓ మలయాళీ సూపర్ హిట్టు సినిమాకు రీమేక్ ఇది. ఇందులో రాజశేఖర్ కూతురిగా శివానీ రాజశేఖర్ నటించింది. ఈ తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు మేకర్స్. రియల్ లైఫ్ లో తండ్రీకూతుళ్లయిన వీళ్లిద్దరూ, రీల్ లైఫ్ లో కూడా తండ్రీకూతుళ్లుగా నటించారు.

జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా జీవితనే అందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. అలా.. తల్లి దర్శకత్వంలో తండ్రి హీరోగా నటిస్తున్న సినిమాలో కూతురు పాత్ర పోషించింది రియల్ లైఫ్ డాటర్ శివానీ రాజశేఖర్.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జార్జిరెడ్డి ఫేం ముస్కాన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. ఓటీటీ ఆఫర్లు వస్తున్నప్పటికీ, థియేటర్లలోనే రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News