కట్టప్పకు కరోనా
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా వణికిస్తోంది కరోనా మహమ్మారి. తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. కాస్త నలతగా అనిపించడంతో సత్యరాజ్ ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయనకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. కొత్త ఏడాది ప్రారంభానికి ముందే హీరోయిన్ త్రిష కరోనా బారిన […]
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా వణికిస్తోంది కరోనా మహమ్మారి. తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. కాస్త నలతగా అనిపించడంతో సత్యరాజ్ ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయనకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
కొత్త ఏడాది ప్రారంభానికి ముందే హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడినట్టు ప్రకటించింది ఈ హీరోయిన్. ఆ తర్వాత మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు సత్యరాజ్ ఇలా కరోనా బారిన పడ్డారు.
టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటికే మహేష్, విశ్వక్ సేన్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, తమన్ లాంటి ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా తనకు కూడా కరోనా సోకినట్టు హీరోయిన్ నికీషా పటేల్ ప్రకటించింది. థర్డ్ వేవ్ మొదలవ్వడంతో.. టాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆపేశారు.