నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా?

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా? కోలీవుడ్ నటుడు శింబుతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా? అవుననే అంటోంది కోలీవుడ్ మీడియా. ప్రస్తుతం వీళ్లిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారట. కాస్ట్ లీ పబ్బులో, ఖరీదైన రెస్టారెంట్ లో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారట. వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమాతోనే ఇద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగిందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమ్మాయిల్ని పడగొట్టడంలో దిట్ట శింబు. ఈ హీరోకు గతంలో […]

Advertisement
Update:2022-01-08 12:30 IST

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా? కోలీవుడ్ నటుడు శింబుతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా? అవుననే అంటోంది కోలీవుడ్ మీడియా. ప్రస్తుతం వీళ్లిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారట. కాస్ట్ లీ పబ్బులో, ఖరీదైన రెస్టారెంట్ లో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారట.

వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమాతోనే ఇద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగిందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమ్మాయిల్ని పడగొట్టడంలో దిట్ట శింబు. ఈ హీరోకు గతంలో నయనతార, హన్సిక, త్రిషతో డేటింగ్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి, ఆ అనుభవం మొత్తం రంగరించి నిధిని ముగ్గులోకి దించి ఉంటాడని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

ఇక నిధి అగర్వాల్ విషయానికొస్తే, ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. బాలీవుడ్ లో ప్రస్థానం మొదలుపెట్టి, టాలీవుడ్ లో సక్సెస్ అయి, ఇప్పుడు కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఏ ఇండస్ట్రీలో ఆమెకు పూర్తిస్థాయిలో క్రేజ్ రాలేదు. ఇలాంటి టైమ్ లో ఆమె ప్రేమ వ్యవహారాలు పెట్టుకునేంత పిచ్చి పని చేయదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం కెరీర్ తో సంబంధం లేకుండా ఆమె ప్రేమలో పడినట్టు చెబుతున్నారు. ఇటు నిధి అగర్వాల్, అటు శింబు దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News