ఈ వారం సినిమాలు.. అంచనాల కరువు
అందరి దృష్టి సంక్రాంతి సినిమాలపై ఉండడంతో.. థియేటర్లలోకి ఏ సినిమా వస్తుందో, ఏది పోతుందా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జనవరి 1న ఇందువదనతో పాటు మరో 2 సినిమాలొచ్చాయి. ఇవి ఎప్పుడొచ్చాయో కూడా తెలియలేదు. అంతలోనే ఈ వారాంతం మరో 4 సినిమాలొస్తున్నాయి. వీటిపై కూడా పెద్దగా బజ్ లేకపోవడ బాధాకరం. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న సినిమా అతిథి దేవోభవ. ఆది సాయికుమార్ హీరోగా నటించిన డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ చంద్ర […]
అందరి దృష్టి సంక్రాంతి సినిమాలపై ఉండడంతో.. థియేటర్లలోకి ఏ సినిమా వస్తుందో, ఏది పోతుందా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జనవరి 1న ఇందువదనతో పాటు మరో 2 సినిమాలొచ్చాయి. ఇవి ఎప్పుడొచ్చాయో కూడా తెలియలేదు. అంతలోనే ఈ వారాంతం మరో 4 సినిమాలొస్తున్నాయి. వీటిపై కూడా పెద్దగా బజ్ లేకపోవడ బాధాకరం.
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న సినిమా అతిథి దేవోభవ. ఆది సాయికుమార్ హీరోగా నటించిన డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించాడు. అతడు కంపోజ్ చేసిన ‘బాగుంటుందే..నువ్వు నవ్వితే’ అనే పాట పెద్ద హిట్టవ్వడంతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కు కొత్త ఏడాదిలో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి
ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న మరో మూవీ 1945. డిసెంబర్ 31న రావాల్సిన ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో హీరో రానా. ఇలాంటి పెద్ద హీరో ఉండి కూడా ఈ మూవీపై ఎలాంటి అంచనాల్లేకపోవడానికి, ప్రేక్షకుల దృష్టి దీనిపై పడకపోవడానికి కారణం సరైన ప్రమోషన్ లేకపోవడమే. ఎందుకో ఈ సినిమాతో సంబంధం లేనట్టే వ్యవహరిస్తున్నాడు రానా.
ఈ రెండు సినిమాలతో పాటు హాఫ్ స్టోరీస్, వేయి శుభములు కలుగునీకు అనే మరో 2 సినిమాలు కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.