హీరోగా మారిన మరో కమెడియన్

మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అభివన్ గోమఠం. ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడీ నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అభినవ్ […]

Advertisement
Update:2022-01-04 12:54 IST

మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అభివన్ గోమఠం. ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడీ నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

నిజానికి గతంలోనే అభివన్ కు సోలో హీరోగా సినిమా ఆఫర్లు వచ్చాయి. తేజ దర్శకత్వంలో సీత సినిమా చేస్తున్నప్పుడు కూడా అభివన్ కు హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ మంచి కథ దొరకడంతో, ఇన్నాళ్లకు హీరోగా మారుతున్నాడు ఈ కమెడియన్.

Tags:    
Advertisement

Similar News