ఆ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ సామూహిక సెలవలు..
వర్క్ ఫ్రమ్ హోమ కల్చర్ అలవాటైన తర్వాత సెలవలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ.. అత్యవసర సేవల ఉద్యోగులకు ఒక్కరోజు సెలవు దొరికినా అది అదృష్టమేనని చెప్పాలి. సీఎల్స్ మురిగిపోతున్నా చాలామంది పట్టించుకోరు. ఈఎల్స్ అంటే అవి క్యాష్ చేసుకోడానికి మినహా మిగతా దేనికీ పనికిరావనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితం అసోం కేబినెట్ […]
వర్క్ ఫ్రమ్ హోమ కల్చర్ అలవాటైన తర్వాత సెలవలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ.. అత్యవసర సేవల ఉద్యోగులకు ఒక్కరోజు సెలవు దొరికినా అది అదృష్టమేనని చెప్పాలి. సీఎల్స్ మురిగిపోతున్నా చాలామంది పట్టించుకోరు. ఈఎల్స్ అంటే అవి క్యాష్ చేసుకోడానికి మినహా మిగతా దేనికీ పనికిరావనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితం అసోం కేబినెట్ దీన్ని ఆమోదించింది. తాజాగా ఇది అమలులోకి వస్తోంది. ఈనెల 6, 7 తేదీల్లో అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సామూహిక సెలవలు ప్రకటించారు సీఎం హిమంత.
తల్లిదండ్రులు, లేదా అత్తమామలు, పిల్లలతో గడిపేందుకు ఈ సెలవల్ని ఉపయోగించుకోవాలని కోరారాయన. 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక సెలవలకు తోడు 8వతేదీ రెండో శనివారం, 9 ఆదివారం.. ఇలా వారాంతం సెలవల్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆ సెలవలు ప్రత్యేకం..
6, 7 తేదీల్లో ఇచ్చే ప్రత్యేక సెలవల్ని ఉపయోగించుకోకపోతే.. అవి ఇక ఎప్పటికీ పనికిరావు. కేవలం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆ రెండ్రోజులు మాత్రమే అసోంలో ప్రత్యేక సెలవలుగా ప్రకటించారు. తల్లిదండ్రులు లేనివారు ఆ కారణం చూపించి సెలవలు రద్దు చేసుకుని, భవిష్యత్తులో అవసరానికి ఉపయోగించుకోవడం కుదరదని ముందే ప్రకటించింది ప్రభుత్వం. ఉద్యోగులకు ఉండే సాధారణ సెలవలకు ప్రతి ఏడాది ఇవి అదనంగా లభిస్తాయి. అత్యవసర సేవలు అంటూ ఎవరినీ ఆఫీస్ కి రావాలని బలవంత పెట్టరు. కచ్చితంగా అందరూ ఆ రెండ్రోజులు సెలవు తీసుకోవాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచిస్తోంది అసోం ప్రభుత్వం.
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ప్రత్యేక సెలవల్ని ప్రకటించింది. జీవిత భాగస్వామి పుట్టినరోజు, లేదా పిల్లల పుట్టినరోజున సెలవు తీసుకోవచ్చని తెలిపింది. అయితే అలాంటి నిబంధనలేవీ పెట్టకుండానే.. రాష్ట్రం మొత్తం ఉద్యోగులందరికీ సామూహిక సెలవల్ని ప్రకటించి అసోం ప్రభుత్వం ఆసక్తికర ముందడుగు వేసింది.