సంక్రాంతికి రౌడీ బాయ్స్ రెడీ
దిల్ రాజు కుటుంబం నుంచి తొలిసారిగా ఓ హీరో ముస్తాబయ్యాడు. శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమౌతున్న సినిమా రౌడీ బాయ్స్. చాన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బంది పడుతూ వస్తోంది ఈ మూవీ. ఫ్యామిలీ హీరో సినిమా కావడంతో మంచి టైమింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. రౌడీ బాయ్స్ సినిమా సంక్రాంతికి రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను […]
దిల్ రాజు కుటుంబం నుంచి తొలిసారిగా ఓ హీరో ముస్తాబయ్యాడు. శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమౌతున్న సినిమా రౌడీ బాయ్స్. చాన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బంది పడుతూ వస్తోంది ఈ మూవీ. ఫ్యామిలీ హీరో సినిమా కావడంతో మంచి టైమింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు దిల్ రాజు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
రౌడీ బాయ్స్ సినిమా సంక్రాంతికి రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఏ తేదీకి విడుదల చేస్తారనేది త్వరలోనే వెల్లడించబోతున్నారు. శ్రీహర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకుడు.
పక్కా యూత్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. రౌడీ బాయ్స్ అనే పేరు ఎందుకు పెట్టారో, సినిమా చూసి తెలుసుకోవాలంటున్నారు మేకర్స్.