ఈ ఏడాది చివర్లో 5 సినిమాలు
ఈ వారాంతం 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటికి ఓ ప్రత్యేకత ఉంది. అవి కేవలం ఈ వారాంతానికో, ఈ మాసాంతానికో వస్తున్న సినిమాలు మాత్రమే కాదు, ఈ ఏడాదికి గాను వస్తున్న చివరి చిత్రాలు ఇవే. మరి వీటిలో 2021కు మంచి ముగింపు ఇచ్చే సినిమా ఏది? ఆ అదృష్టం ఏ సినిమాకు దక్కబోతోంది. ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న మూవీ అర్జున్ ఫాల్గుణ. శ్రీవిష్ణు హీరోగా నటించిన […]
ఈ వారాంతం 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటికి ఓ ప్రత్యేకత ఉంది. అవి కేవలం ఈ వారాంతానికో, ఈ మాసాంతానికో వస్తున్న సినిమాలు మాత్రమే కాదు, ఈ ఏడాదికి గాను వస్తున్న చివరి చిత్రాలు ఇవే. మరి వీటిలో 2021కు మంచి ముగింపు ఇచ్చే సినిమా ఏది? ఆ అదృష్టం ఏ సినిమాకు దక్కబోతోంది.
ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న మూవీ అర్జున్ ఫాల్గుణ. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డానికి కారణం, అతడు ఇంతకుముందు చేసిన రాజరాజ చోర సినిమా హిట్టవ్వడమే. ఆ సినిమా సక్సెస్ తో అర్జున-ఫాల్గుణపై అందరిచూపు పడింది. తేజ మర్ని అనే కొత్త కుర్రాడు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా తర్వాత ఓ స్థాయి అంచనాలతో వస్తున్న మూవీ 1945. రానా నటించిన సినిమా ఇది. టైటిల్ కు తగ్గట్టే స్వతంత్రానికి ముందు జరిగిన కథతో తెరకెక్కిన సినిమా ఇది. సత్యశివ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాత. రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు
ఈ రెండు సినిమాలతో పాటు వస్తున్న అంతఃపురం, సత్యభామ, విక్రమ్ సినిమాలపై పెద్దగా అంచనాల్లేవు. కాకపోతే అంతఃపురం సినిమా తమిళ వెర్షన్ హిట్టయింది. తెలుగులో కూడా సక్సెస్ అయ్యే లక్షణాలు ఈ సినిమాకున్నాయి. మరి ఈ 5 సినిమాల్లో ఏ మూవీ 2021కు ఫినిషింగ్ టచ్ ఇస్తుందో చూడాలి.