నా లైఫ్ కు దగ్గరైన సినిమా " శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైన్స్ ఫిక్షన్ సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలు అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. ఈరోజు సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లోనే సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని చెప్పేశారు. టైమ్ మెషీన్ […]
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైన్స్ ఫిక్షన్ సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలు అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. ఈరోజు సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లోనే సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని చెప్పేశారు.
టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఒకే ఒక జీవితం. హీరోతో పాటు అతడి స్నేహితులు ఇద్దరూ, టైమ్ మెషీన్ లో గతంలోకి వెళ్లిపోవడం ఈ సినిమా కథ. తమ స్కూల్ డేస్ రోజుల్లోకి వీళ్లు వెళ్లిపోతారు. ఈ కథపై చాలా నమ్మకంగా ఉన్నాడు హీరో శర్వానంద్.
“ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.. ఇప్పుడే మొత్తం మాట్లాడలేను. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నరేషన్ అప్పటి నుంచి ఆమె మా వెనకాల నుంచి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్. ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా.”
రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. విడుదల తేదీని వచ్చేనెల ప్రకటించబోతున్నారు.