ఎల్లో అలర్ట్.. ఆర్ఆర్ఆర్ కు దెబ్బ
ఉత్తరాదిని ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావం త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై గట్టిగా పడేలా ఉంది. చాలా ప్రాంతాల్లో సెకండ్ షోలు రద్దు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి 50శాతం ఆక్యుపెన్సీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ ఢిల్లీ సర్కారు ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. […]
ఉత్తరాదిని ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావం త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై గట్టిగా పడేలా ఉంది. చాలా ప్రాంతాల్లో సెకండ్ షోలు రద్దు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో తిరిగి 50శాతం ఆక్యుపెన్సీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ ఢిల్లీ సర్కారు ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది.
కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చాయి. ఆంక్షల కారణంగా ఢిల్లీలో సినిమా హాళ్లు మూసేశారు. ఈరోజు సాయంత్రం నుంచే ఢిల్లీలో సినిమా హాళ్లు పనిచేయడం మానేశాయి. ఇది కనీసం 2 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆర్ఆర్ఆర్ కు చిక్కులు తప్పేలా లేవు.
ఓవైపు షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ లాంటి సినిమాల్ని వాయిదా వేస్తున్నారు. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయడానికే నిర్ణయించుకున్నారు. ప్రచారాన్ని భారీ ఎత్తున చేపడుతున్నారు. ఉత్తరాదిన ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలున్నాయి. రాజమౌళి సినిమా కావడం, అలియా భట్ హీరోయిన్ గా నటించడం, కీలక పాత్రలో అజయ్ దేవగన్ పోషించడం ఈ సినిమాపై అంచనాల్ని పెంచింది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమలైతే ఆర్ఆర్ఆర్ కు మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.