మహేష్-త్రివిక్రమ్ మధ్య చర్చలు
రీసెంట్ గా మహేష్ బాబుకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. స్పెయిన్ లో మహేష్ మోకాలికి చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ఆయన నేరుగా దుబాయ్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు మహేష్. ఇదిలా ఉండగా..మహేష్ ను చూసేందుకు త్రివిక్రమ్, తమన్ దుబాయ్ వెళ్లారు. వీళ్లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా వెళ్లాడు. సర్కారువారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడు మహేష్. […]
రీసెంట్ గా మహేష్ బాబుకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. స్పెయిన్ లో మహేష్ మోకాలికి చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ఆయన నేరుగా దుబాయ్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు మహేష్. ఇదిలా ఉండగా..మహేష్ ను చూసేందుకు త్రివిక్రమ్, తమన్ దుబాయ్ వెళ్లారు. వీళ్లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా వెళ్లాడు.
సర్కారువారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడు మహేష్. దీనికి సంబంధించి కథాచర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే దుబాయ్ లో హీరో-దర్శకుడి మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. పనిలోపనిగా పాటలకు సంబంధించి తమన్ తో చర్చలు కూడా జరిపారు. త్రివిక్రమ్ తో సినీ చర్చలు జరిపినట్టు స్వయంగా మహేష్ బాబు ప్రకటించాడు.
లెక్కప్రకారం, సర్కారువారిపాట సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలి మహేష్. కానీ ఆర్ఆర్ఆర్ వల్ల మహేష్-జక్కన్న ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో సర్కారువారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.