బంగార్రాజు షూటింగ్ అప్ డేట్స్
నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగచైతన్య, కృతి శెట్టిలపై పాటను చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ తో.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇదే విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చివరి రోజు షూటింగ్.. మరో పెప్పీ మాస్ సాంగ్ రెడీ అవుతోంది.. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది అని ట్వీట్ వేశారు. దీంతో […]
నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తయింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగచైతన్య, కృతి శెట్టిలపై పాటను చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ తో.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ఇదే విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చివరి రోజు షూటింగ్.. మరో పెప్పీ మాస్ సాంగ్ రెడీ అవుతోంది.. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది అని ట్వీట్ వేశారు. దీంతో పాటు నాగార్జున ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో చిన్న బంగార్రాజుగా పంచెకట్టులో నాగ చైతన్య మెరిశారు. ఇక కృతి శెట్టి హాట్ లుక్‌లో అదిరిపోయారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.