శ్రీవిష్ణు నుంచి మరో సినిమా రెడీ
అర్జున్ ఫాల్గుణ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన శ్రీవిష్ణు, అంతలోనే మరో సినిమాను కూడా రెడీ చేశాడు. అతడు నటించిన భళా తందనాన సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ‘భళా తందనాన’ అనేది కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో […]
అర్జున్ ఫాల్గుణ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన శ్రీవిష్ణు, అంతలోనే మరో సినిమాను కూడా రెడీ చేశాడు. అతడు నటించిన భళా తందనాన సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.
‘భళా తందనాన’ అనేది కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదనే విషయాన్ని ఈ పోస్టర్ తో చూపించారు.
హీరో శ్రీ విష్ణుని ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నారు డైరెక్టర్ చైతన్య దంతులూరి. చిత్రంలో కేథరిన్ థ్రెసా రోల్ కి కూడా ప్రాముఖ్యత ఉండనుంది. ఇక ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుంది.
పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు