వేరే కాలంలోకి తీసుకెళ్తానంటున్న నాని

శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తానంటున్నాడు హీరో నాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షుకులకు ఓ కొత్త అనుభూతి ఇస్తుందని, క్రిస్మస్ హిట్ ఇదేనని అంటున్నాడు. “కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు […]

Advertisement
Update:2021-12-22 15:23 IST

శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తానంటున్నాడు హీరో నాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షుకులకు ఓ కొత్త అనుభూతి ఇస్తుందని, క్రిస్మస్ హిట్ ఇదేనని అంటున్నాడు.

“కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం. ఏవో సెట్లు వేశాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.”

ఇలా తన సినిమా గురించి గొప్పగా చెప్పాడు నాని. శ్యామ్ సింగరాయ్ సినిమాకు, కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమాకు ఎక్కడా పోలికలు ఉండవని క్లారిటీ ఇచ్చిన నాని.. సినిమాలో 4 ఎపిసోడ్స్ అందరికీ బాగా నచ్చుతాయని నమ్మకంగా చెబుతున్నాడు.

సాయిపల్లవి, కృతిషెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 24న రిలీజ్ అవుతోంది. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. నాని కెరీర్ లో బిగ్ బడ్జెట్ సినిమా ఇదే.

Tags:    
Advertisement

Similar News