తన కోటు కథ బయటపెట్టిన నాని

శ్యామ్ సింగరాయ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రెగ్యులర్ గా వచ్చే షర్ట్, ప్యాంట్ తో పాటు కొత్తగా కోటు (బ్లేజర్) వేసుకొని వచ్చాడు నాని. దీనికి కారణం కూడా బయటపెట్టాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు, తన బ్లేజర్ కు లింక్ ఉందంటున్నాడు న్యాచురల్ స్టార్. “ఎప్పుడూ వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్ వేసుకునే వస్తాడని అందరూ అంటుంటారు. అందుకే మా ఆవిడ ఓ పది బ్లేజర్‌లు కొనేసింది. మనం ఏం పీకామని అని నేను ఇన్నాళ్లూ వేసుకోలేదు. […]

Advertisement
Update:2021-12-19 12:27 IST

శ్యామ్ సింగరాయ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రెగ్యులర్ గా వచ్చే షర్ట్, ప్యాంట్ తో పాటు కొత్తగా కోటు (బ్లేజర్) వేసుకొని వచ్చాడు నాని. దీనికి కారణం కూడా బయటపెట్టాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు, తన బ్లేజర్ కు లింక్ ఉందంటున్నాడు న్యాచురల్ స్టార్.

“ఎప్పుడూ వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్ వేసుకునే వస్తాడని అందరూ అంటుంటారు. అందుకే మా ఆవిడ ఓ పది బ్లేజర్‌లు కొనేసింది. మనం ఏం పీకామని అని నేను ఇన్నాళ్లూ వేసుకోలేదు. బాగా దుమ్ముపట్టి పోయాయ్. కానీ శ్యామ్ సింగ రాయ్ సినిమా చూశాక వేసుకోవాలని అనిపించింది. ఇంతకు మించి సినిమా గురించి రిపీట్ చేసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మా టీం అందరి కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ డిసెంబర్ 24న మీకు తెలుస్తుంది. మీ కళ్లలో కూడా 24న కనిపిస్తుంది.”

ఇలా శ్యామ్ సింగరాయ్ కు తనదైన శైలిలో ప్రచారం ఇచ్చాడు నాని. ఈ సినిమాలో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు నాని. సాయిపల్లవి, మడొన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. క్రిస్మస్ కానుకగా 24న థియేటర్లలోకి వస్తోంది శ్యామ్ సింగరాయ్ సినిమా.

Tags:    
Advertisement

Similar News