చాలా గర్వంగా ఉందంటున్న నాని

శ్యామ్ సింగరాయ్ సినిమా చేయడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాడు నాని. తనతో పాటు యూనిట్ లో ఎవ్వరికీ ఇంచ్ కూడా భయం లేదని, ఈ క్రిస్మస్ మాదే అంటున్నాడు నేచురల్ స్టార్. శ్యామ్ సింగరాయ్ ట్రయిలర్ లాంఛ్ లో మాట్లాడిన నాని.. శ్యామ్ సింగరాయ్ ను తన కెరీర్ బెస్ట్ మూవీగా చెబుతున్నాడు. ఈ సినిమాలో నటించిన సాయిపల్లవిని ఆకాశానికెత్తేశాడు నాని. సాయి పల్లవి మంచి డాన్సర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఓ డాన్స్ […]

Advertisement
Update:2021-12-15 14:33 IST

శ్యామ్ సింగరాయ్ సినిమా చేయడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాడు నాని. తనతో పాటు యూనిట్ లో ఎవ్వరికీ ఇంచ్ కూడా భయం లేదని, ఈ క్రిస్మస్ మాదే అంటున్నాడు నేచురల్ స్టార్. శ్యామ్ సింగరాయ్ ట్రయిలర్ లాంఛ్ లో మాట్లాడిన నాని.. శ్యామ్ సింగరాయ్ ను తన కెరీర్ బెస్ట్ మూవీగా చెబుతున్నాడు.

ఈ సినిమాలో నటించిన సాయిపల్లవిని ఆకాశానికెత్తేశాడు నాని. సాయి పల్లవి మంచి డాన్సర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఓ డాన్స్ నంబర్ శ్యామ్ సింగరాయ్ లో ఉందట. ఆ పాట చూసి తను షాక్ అయ్యానని, ఆడియన్స్ కూడా కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నాడు. సాయిపల్లవి పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారని చెప్పుకొచ్చాడు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది శ్యామ్ సింగరాయ్ సినిమా. రాహుల్ సంకృత్యాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో చాలామందికి అవార్డులు వస్తాయని చెబుతున్నాడు. మూవీలో 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు నాని.

Tags:    
Advertisement

Similar News