సమంత సూపర్ అంటున్న బన్నీ
పుష్ప సినిమాలో సమంత ఐటెంసాంగ్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా సమంత సాంగ్ పై స్పందించాడు అల్లు అర్జున్. సినిమాలో సమంత ఐటెంస్ంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనని చెబుతున్నాడు. సమంత ఈ ప్రాజెక్టులోకి రావడం వల్ల పుష్ప వెయిట్ మరింత పెరిగిందంటున్న బన్నీ.. పాటలో సమంత స్టెప్పులు బాగా వేసిందని మెచ్చుకున్నాడు. ఈ పాటకు సంబంధించి చిన్న ప్రోమో ఆల్రెడీ రిలీజైంది. అందులో బన్నీతో కలిసి సమంత వేసిన ఓ డాన్స్ మూమెంట్ ఆల్రెడీ […]
పుష్ప సినిమాలో సమంత ఐటెంసాంగ్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా సమంత సాంగ్ పై స్పందించాడు అల్లు అర్జున్. సినిమాలో సమంత ఐటెంస్ంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనని చెబుతున్నాడు. సమంత ఈ ప్రాజెక్టులోకి రావడం వల్ల పుష్ప వెయిట్ మరింత పెరిగిందంటున్న బన్నీ.. పాటలో సమంత స్టెప్పులు బాగా వేసిందని మెచ్చుకున్నాడు.
ఈ పాటకు సంబంధించి చిన్న ప్రోమో ఆల్రెడీ రిలీజైంది. అందులో బన్నీతో కలిసి సమంత వేసిన ఓ డాన్స్ మూమెంట్ ఆల్రెడీ వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, ఈ స్టెప్స్ కంపోజ్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సాంగ్ సినిమా ఫస్టాఫ్ లోనే వస్తుందట.
దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన ఐటెంసాంగ్స్ ఏవీ ఫెయిల్ అవ్వలేదు. పుష్ప ఐటెం సాంగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వడంపై ఆనందం వ్యక్తంచేశాడు బన్నీ
రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.