పుష్ప ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు

కరోనా కారణంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. అయితే నిర్మాతలకు ఏమాత్రం టెన్షన్ లేదు. ఎందుకంటే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది. పుష్ప బడ్జెట్ అటుఇటుగా 180 కోట్ల రూపాయలు కాగా.. ఈ సినిమా 250 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రా-సీడెడ్ లో ఈ సినిమా 60 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నైజాంలో ఈ సినిమాను […]

Advertisement
Update:2021-12-13 10:37 IST

కరోనా కారణంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. అయితే నిర్మాతలకు ఏమాత్రం టెన్షన్ లేదు. ఎందుకంటే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది. పుష్ప బడ్జెట్ అటుఇటుగా 180 కోట్ల రూపాయలు కాగా.. ఈ సినిమా 250 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

ఆంధ్రా-సీడెడ్ లో ఈ సినిమా 60 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నైజాంలో ఈ సినిమాను 40 కోట్ల రూపాయలకు దిల్ రాజు దక్కించుకున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఇవి కాకుండా శాటిలైట్-డిజిటల్ రైట్స్ కింద మరో 50 కోట్ల రూపాయలు వచ్చాయి. వీటితో పాటు మిగతా అన్ని హక్కులు కలుపుకొని ఈ సినిమా 250 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

అఖండ సినిమాతో టాలీవుడ్ జనాలకు కాస్త నమ్మకం కుదిరింది. జనాలు థియేటర్లకు వస్తున్నారని తెలిసొచ్చింది. పైగా ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉందనే విషయంపై కూడా స్పష్టత వచ్చింది. దీంతో పుష్ప సినిమాను రికార్డ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది పుష్ప.

Tags:    
Advertisement

Similar News