ఆర్ఆర్ఆర్ తర్వాత మరిన్ని మల్టీస్టారర్లు

తెలుగులో మల్టీస్టారర్లు తక్కువే. వచ్చిన మల్టీస్టారర్లలో కూడా హీరోల స్టార్ డమ్ లేదా వయసు మధ్య చాలా తేడా ఉంది. ఒకే స్టార్ డమ్, ఒకే వయసున్న హీరోలతో మల్టీస్టారర్లు రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత మాత్రం సిసలైన మల్టీస్టారర్లు వస్తాయంటున్నాడు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత, చాలామంది హీరోలు కలుస్తారని, చాలామంది రచయితలు ఆ దిశగా కథలు రాస్తారని అంటున్నాడు. “రచయితలకు చాలా ఆలోచనలున్నాయి. ఇద్దరు […]

Advertisement
Update:2021-12-11 14:41 IST

తెలుగులో మల్టీస్టారర్లు తక్కువే. వచ్చిన మల్టీస్టారర్లలో కూడా హీరోల స్టార్ డమ్ లేదా వయసు మధ్య చాలా తేడా ఉంది. ఒకే స్టార్ డమ్, ఒకే వయసున్న హీరోలతో మల్టీస్టారర్లు రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత మాత్రం సిసలైన మల్టీస్టారర్లు వస్తాయంటున్నాడు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత, చాలామంది హీరోలు కలుస్తారని, చాలామంది రచయితలు ఆ దిశగా కథలు రాస్తారని అంటున్నాడు.

“రచయితలకు చాలా ఆలోచనలున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు లేదా ముగ్గురు స్టార్ హీరోలు కలిసి చేసేలా చాలా ఆలోచనలు వాళ్ల దగ్గరున్నాయి. కాకపోతే ఫ్యాన్స్ ఏమనుకుంటారు, కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా, స్క్రీన్ స్పేస్ కుదురుతుందా అనే అనుమానాలతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత అలాంటి అనుమానాలన్నీ పోతాయి. చాలామంది హీరోలు మల్టీస్టారర్ మూవీస్ కోసం ముందుకొస్తారు.”

ఇలా ఆర్ఆర్ఆర్ తో ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తామని చెబుతున్నాడు రాజమౌళి. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కనిపించరని, వాళ్ల క్రేజ్ అస్సలు గుర్తురాదని, కేవలం రామ్-భీమ్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయంటున్నాడు జక్కన్న. ఇప్పటివరకు తను తీసిన సినిమాల్లో హై-ఎమోషనల్ మూవీ ఇదేనని చెబుతున్నాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News