బోయపాటి బయటపెట్టిన భద్ర సీక్రెట్

బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర. ఆ సినిమాతో దర్శకుడిగా మారడానికి ఆయనకు ఏడాదిన్నర టైమ్ పట్టింది. అయితే ఈ క్రమంలో చాలా చేదు అనుభవాల్ని చవిచూశాడు ఈ దర్శకుడు. తన కథను కాపీ కొట్టి, ఓ సూపర్ హిట్ సినిమా తీశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? మహేష్ బాబు ఒక్కడు మూవీ. అవును.. ఒక్కడు కథ తనదే అంటున్నాడు బోయపాటి. తను రాసిన కథ పట్టుకొని చాలామంది చుట్టూ తిరిగానని, ఆ […]

Advertisement
Update:2021-12-11 14:34 IST

బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర. ఆ సినిమాతో దర్శకుడిగా మారడానికి ఆయనకు ఏడాదిన్నర టైమ్ పట్టింది. అయితే ఈ క్రమంలో చాలా చేదు అనుభవాల్ని చవిచూశాడు ఈ దర్శకుడు. తన కథను కాపీ కొట్టి, ఓ సూపర్ హిట్ సినిమా తీశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? మహేష్ బాబు ఒక్కడు మూవీ.

అవును.. ఒక్కడు కథ తనదే అంటున్నాడు బోయపాటి. తను రాసిన కథ పట్టుకొని చాలామంది చుట్టూ తిరిగానని, ఆ టైమ్ లో ఓ నిర్మాత తన కథ విని ఇచ్చేయమన్నాడట. కానీ బోయపాటి మాత్రం ఆ కథను ఇవ్వలేదట. ఆ తర్వాత కొన్నాళ్లకు తన కథే ఒక్కడు సినిమాగా వచ్చిందన్నాడు. తన కథ ఎలా లీక్ అయిందో ఇప్పటికీ తనకు తెలియదంటున్నాడు బోయపాటి.

ఒక్కడు రిలీజైన తర్వాత మరోసారి భద్ర కథపై కూర్చొని మార్పుచేర్పులు చేసుకున్నానని తెలిపాడు బోయపాటి. చివరికి బన్నీతో భద్ర తీయాలని అనుకున్నాడట. అయితే అప్పుడే బన్నీ, ఆర్య సినిమాకు ఓకే చెప్పాడట. అయితే కథ నచ్చడంతో స్వయంగా బన్నీనే, బోయపాటిని దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లి.. కథ వినిపించి ఓకే చేయించి, దిల్ రాజు ద్వారా అడ్వాన్స్ ఇప్పించాడట. ఆ తర్వాత రవితేజ ఆ కథ విని ఓకే చేయడం హిట్టవ్వడం జరిగిపోయాయి. ఇలా భద్ర కోసం తను పడిన స్ట్రగుల్ ను బయటపెట్టాడు బోయపాటి.

Tags:    
Advertisement

Similar News