9 రోజులు నీళ్లు తాగని హీరో

సరైన క్యారెక్టర్ పడితే, ఆ పాత్ర కోసం హీరోలు ఎంతైనా కష్టపడతారని అంటున్నాడు నాగశౌర్య. తన కెరీర్ కు కూడా లక్ష్య రూపంలో అలాంటి పాత్ర పడిందని, అందుకే పార్థు పాత్ర కోసం 8 ప్యాక్ ఫిజిక్ సంపాదించానని చెప్పుకొచ్చాడు. దీని కోసం పడిన కష్టాన్ని బయటపెట్టాడు శౌర్య. ఏకంగా 9 రోజుల పాటు మంచి నీళ్లు ముట్టలేదంట. “ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సినిమాలో పార్థు మారాడని చెప్పడానికి […]

Advertisement
Update:2021-12-09 14:21 IST

సరైన క్యారెక్టర్ పడితే, ఆ పాత్ర కోసం హీరోలు ఎంతైనా కష్టపడతారని అంటున్నాడు నాగశౌర్య. తన కెరీర్ కు కూడా లక్ష్య రూపంలో అలాంటి పాత్ర పడిందని, అందుకే పార్థు పాత్ర కోసం 8 ప్యాక్ ఫిజిక్ సంపాదించానని చెప్పుకొచ్చాడు. దీని కోసం పడిన కష్టాన్ని బయటపెట్టాడు శౌర్య. ఏకంగా 9 రోజుల పాటు మంచి నీళ్లు ముట్టలేదంట.

“ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా సినిమాలో పార్థు మారాడని చెప్పడానికి అలా బాడీలో మార్పులు చూపించాను. ఒక్కసారి అనుకుంటే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం కేవలం 3 రోజుల్లోనే ట్రయినింగ్ తీసుకొని, ఆర్చరీలో టెక్నిక్స్ నేర్చుకున్నాను. చదువు తప్ప నాకు అన్నీ తొంద‌ర‌గా వస్తాయి.”

లక్ష్య సినిమా కచ్చితంగా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ అవుతుందంటున్నాడు శౌర్య. కెరీర్ లో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా చేశానని, అలాగే కెరీర్ లో తొలిసారి ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించానని చెప్పుకొచ్చాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది లక్ష్య మూవీ.

Tags:    
Advertisement

Similar News