జబర్దస్త్ పై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్
జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకోబోతున్నాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిపై సుధీర్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ఆ పుకార్లపై క్లారిటీ వచ్చింది. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా సుడిగాలి సుధీర్ ప్రకటించాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి తప్పుకుంటోంది కేవలం సుధీర్ మాత్రమే కాదు.. అతడి టీమ్ కు చెందిన రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా తప్పుకుంటున్నారు. ఈ శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్ట్ కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుంది. […]
జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకోబోతున్నాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిపై సుధీర్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ఆ పుకార్లపై క్లారిటీ వచ్చింది. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా సుడిగాలి సుధీర్ ప్రకటించాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి తప్పుకుంటోంది కేవలం సుధీర్ మాత్రమే కాదు.. అతడి టీమ్ కు చెందిన రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా తప్పుకుంటున్నారు.
ఈ శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్ట్ కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో సుడిగాలి సుధీర్ ఈ ప్రకటన చేశాడు. ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి చెబుదామనుకున్నామని, కానీ ఇలా జబర్దస్త్ వేదికపై నుంచే తాము తప్పుకుంటున్నట్టు చెప్పడం బాధగా ఉందని అన్నాడు రామ్ ప్రసాద్.
సుడిగాలి సుధీర్ కు సినిమా అవకాశాలు పెరిగాయి. క్యారెక్టర్ రోల్స్ తో పాటు, హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అటు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కు కూడా కమెడియన్లుగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు వీళ్లు ప్రకటన చేశారు. అయితే వీళ్లు నిజంగానే ఈ ప్రకటన చేశారా లేక స్కిట్ లో భాగంగా నటించారా అనే విషయం శుక్రవారం తేలిపోతుంది.