కాజల్ ప్లేస్ ఆక్రమించిన తమన్న
ఓ హీరోయిన్ చేయాల్సిన సినిమాను మరో హీరోయిన్ ఎగరేసుకుపోవడం సర్వసాధారణం. ఈ విషయంలో కొంతమంది హీరోల మధ్య గొడవలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే కాజల్-తమన్న విషయంలో ఈ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే, వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. కాజల్ చేయాల్సిన ఓ సినిమాను తమన్న దక్కించుకుంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఇండియన్-2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమౌతూ వస్తోంది. అదే టైమ్ లో […]
ఓ హీరోయిన్ చేయాల్సిన సినిమాను మరో హీరోయిన్ ఎగరేసుకుపోవడం సర్వసాధారణం. ఈ విషయంలో కొంతమంది హీరోల మధ్య గొడవలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే కాజల్-తమన్న విషయంలో ఈ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే, వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. కాజల్ చేయాల్సిన ఓ సినిమాను తమన్న దక్కించుకుంది.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఇండియన్-2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమౌతూ వస్తోంది. అదే టైమ్ లో కాజల్ పెళ్లి చేసుకుంది. గర్భం కూడా దాల్చింది. దీంతో ఆమె స్థానంలో తమన్నను తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్.
ఇదే కనుక నిజమైతే.. తమన్న జాక్ పాట్ కొట్టినట్టే. కమల్ సరసన నటించాలని చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోంది మిల్కీబ్యూటీ. ఆ అవకాశం ఈ రూపంలో వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది తమన్న.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇండియన్-2 కోసం చరణ్ సినిమాను కొన్నాళ్ల పాటు పక్కనపెట్టాడు. ఈ నెలలోనే ఇండియన్-2 సినిమా సెట్స్ పైకి రాబోతోంది.