పాప పుట్టిన తర్వాత మారిపోయా: శ్రియ

పెళ్లయిన తర్వాత బార్సిలోనాలో కాపురం పెట్టింది శ్రియ. సోషల్ మీడియాలో కనిపించడం తప్ప, ఇండియాలో ఆమె పెద్దగా కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగిపోయాయి. శ్రియ చెప్పేవరకు ఆమెకు పాప పుట్టిందనే విషయం బాహ్యప్రపంచానికి తెలియలేదు. అలా తనకు పాప పుట్టిందనే విషయాన్ని బయటపెట్టిన శ్రియ.. ప్రస్తుతం తనకు పాపే ప్రపంచం అంటోంది. “పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం […]

Advertisement
Update:2021-12-07 14:32 IST

పెళ్లయిన తర్వాత బార్సిలోనాలో కాపురం పెట్టింది శ్రియ. సోషల్ మీడియాలో కనిపించడం తప్ప, ఇండియాలో ఆమె పెద్దగా కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగిపోయాయి. శ్రియ చెప్పేవరకు ఆమెకు పాప పుట్టిందనే విషయం బాహ్యప్రపంచానికి తెలియలేదు. అలా తనకు పాప పుట్టిందనే విషయాన్ని బయటపెట్టిన శ్రియ.. ప్రస్తుతం తనకు పాపే ప్రపంచం అంటోంది.

“పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.”

ఇక ప్రెగ్నెన్సీ తర్వాత తనలో చాలా మార్పులొచ్చాయంటోంది శ్రియ. కానీ అందాన్ని కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డానని, మరో 20 ఏళ్లు సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది.

“ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది.”

ఆమె నటించిన గమనం సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. పాప పుట్టిన తర్వాత శ్రియ నుంచి వస్తున్న సినిమా ఇదే.

Tags:    
Advertisement

Similar News