విడాకులపై మరోసారి స్పందించిన సమంత
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్లూ సినిమాలకు దూరమైన సమంత, ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై దృష్టిపెట్టింది. రీసెంట్ గా పుష్ప ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ చేసింది. కొత్త సినిమా కూడా స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మరోసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించింది సమంత. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడినట్టు చెప్పుకొచ్చింది సమంత. ఆ టైమ్ లో చనిపోతానేమో అని భయపడిందంట. అయితే ఆ […]
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్లూ సినిమాలకు దూరమైన సమంత, ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై దృష్టిపెట్టింది. రీసెంట్ గా పుష్ప ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ చేసింది. కొత్త సినిమా కూడా స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మరోసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించింది సమంత.
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడినట్టు చెప్పుకొచ్చింది సమంత. ఆ టైమ్ లో చనిపోతానేమో అని భయపడిందంట. అయితే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడినట్టు చెప్పుకొచ్చింది. తనను తాను బలహీనురాలిగా అనుకునేదట సమంత. విడాకుల వ్యవహారం నుంచి బయటపడిన తర్వాత తనలో ఉన్న శక్తిని గుర్తించానని చెప్పుకొచ్చింది.
ప్రతి మనిషిలో శక్తి ఉంటుందని, కష్టాల నుంచి బయటపడే క్రమంలో ఆ శక్తి బయటపడుతుందని చెప్పుకొచ్చింది సమంత. బాధ అయినా, సంతోషమైనా తను ఎక్కువగా ఉంచుకోనని, అందరితో పంచుకుంటానని తెలిపింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది తనను అన్ని విధాలుగా ఆదుకున్నారని, వాళ్లను జీవితాంతం గుర్తుంచుకుంటానని అంటోంది.