డైలమాలో సీనియర్ హీరో రాజశేఖర్

సీనియర్ నటుడు రాజశేఖర్ డైలమాలో పడ్డాడు. ఈ డైలమా అతడి కొత్త సినిమాకు సంబంధించినది. ఆ సినిమా పేరు శేఖర్. ఇంతకీ ఆ డైలమా ఏంటో చూద్దాం. శేఖర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడీ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో యూనిట్ డైలమాలో పడింది. సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామా లేక నేరుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో పడింది. తాజా […]

Advertisement
Update:2021-12-03 15:01 IST

సీనియర్ నటుడు రాజశేఖర్ డైలమాలో పడ్డాడు. ఈ డైలమా అతడి కొత్త సినిమాకు సంబంధించినది. ఆ సినిమా పేరు శేఖర్. ఇంతకీ ఆ డైలమా ఏంటో చూద్దాం.

శేఖర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడీ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో యూనిట్ డైలమాలో పడింది. సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామా లేక నేరుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో పడింది.

తాజా సమాచారం ప్రకారం, శేఖర్ సినిమాకు పలు ఓటీటీ సంస్థల నుంచి 23 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది మంచి ఆఫర్. అందుకే యూనిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది.
రాజశేఖర్ సినిమా ఇప్పటివరకు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు. కాబట్టి ఓటీటీని పట్టించుకోకుండా నేరుగా థియేటర్లకు వెళ్దాం అనుకుంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థంకావడం లేదు. ఆల్రెడీ ఒమిక్రాన్ వేరియంట్ భయాలు అందర్నీ పట్టిపీడిస్తున్నాయి.

ఇలాంటి క్లిష్ట సమయాల్లో నేరుగా ఓటీటీలో శేఖర్ సినిమాను రిలీజ్ చేద్దామా, థియేటర్ రిలీజ్ వరకు వెయిట్ చేద్దామా అనే మీమాంసలో పడిపోయింది యూనిట్. రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఈ రీమేక్ సినిమాకు దర్శకురాలు.

Tags:    
Advertisement

Similar News