రూ.5కే సినిమా టికెట్టు

ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలకే సినిమా టికెట్ అందుబాటులో వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాను కేవలం 5 రూపాయల ఖర్చుతో చూసే వెసులుబాటు ఏపీలో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సవరించిన టికెట్ ధరల్ని ప్రభుత్వం ప్రకటించింది. సవరించిన టికెట్ రేట్లు కనిష్టంగా 5 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 250 రూపాయలు ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో ఉన్న సినిమా హాళ్లలో 20 రూపాయల నుంచి 250 రూపాయల టిక్కెట్ రేట్లు నిర్ణయించారు. […]

Advertisement
Update:2021-12-01 14:41 IST

ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలకే సినిమా టికెట్ అందుబాటులో వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాను కేవలం 5 రూపాయల ఖర్చుతో చూసే వెసులుబాటు ఏపీలో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సవరించిన టికెట్ ధరల్ని ప్రభుత్వం ప్రకటించింది. సవరించిన టికెట్ రేట్లు కనిష్టంగా 5 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 250 రూపాయలు ఉంది.

మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో ఉన్న సినిమా హాళ్లలో 20 రూపాయల నుంచి 250 రూపాయల టిక్కెట్ రేట్లు నిర్ణయించారు. ఈ పరిథిలో నాన్-ఏసీలో ఎకనమీ విభాగంలో 20 రూపాయల రేటును ఫిక్స్ చేసిన ప్రభుత్వం, మల్టీప్లెక్స్ లోని ప్రీమియం విభాగంలో 250 రూపాయలు పెట్టుకోవచ్చని సూచించింది.

ఇక మున్సిపాలిటీల్లో కనిష్ట టికెట్ ధర 15 రూపాయలు ఉండగా, గరిష్టంగా 150 రూపాయల టికెట్ ధర పెట్టారు. నగర పంచాయతీ ఏరియాల్లో కనిష్ట ధర (డీలక్స్) 15 రూపాయలు, గరిష్ట ధర (ఏసీ ప్రీమియం) 35 రూపాయలుగా నిర్ణయించారు.

ఇక గ్రామ పంచాయతీ పరిథిలో ఉన్న సినిమా హాళ్లలో నాన్-ఏసీ ఎకనమి విభాగంలో టిక్కెట్టుపై 5 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. ఇదే గ్రామ పంచాయతీ పరిథిలో మల్టీప్లెక్స్ ఉంటే.. అందులో ప్రీమియం టికెట్ కు 80 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అయితే ఇలా సవరించిన టికెట్ ధరల్ని ఎంతమంది థియేటర్ యజమానులు ఫాలో అవుతారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News