పని పూర్తిచేసిన లైగర్

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. ఈ చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవ‌ల అమెరికాలో ప్రారంభ‌మైన ఈ మూవీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో మైక్ టైస‌న్ పాత్ర‌కి సంబంధించిన షూట్ పూర్తిచేశారు. ఇందులో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయిన […]

Advertisement
Update:2021-12-01 14:34 IST

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ 'లైగర్'. ఈ చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవ‌ల అమెరికాలో ప్రారంభ‌మైన ఈ మూవీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో మైక్ టైస‌న్ పాత్ర‌కి సంబంధించిన షూట్ పూర్తిచేశారు. ఇందులో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొన్నారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది యూనిట్. మైక్ టైసన్ షూటింగ్ కు బాగా సహకరించారని పేర్కొంది. మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది.

Tags:    
Advertisement

Similar News