లక్ష్య ట్రయిలర్ రివ్యూ

నాగశౌర్య నుంచి మరో సినిమా రెడీ అయింది. దాని పేరు లక్ష్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లవ్, యాక్షన్, ఫ్రెండ్ షిప్ లాంటి ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించారు. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం. ట్రయిలర్ లో పార్థు అనే పాత్రలో కనిపించాడు నాగశౌర్య. ఆర్చరీ అంటే అతడికి ప్రాణం. అతడంటే రితిక (కేతిక శర్మ)కు ప్రాణం. […]

Advertisement
Update:2021-12-01 14:37 IST

నాగశౌర్య నుంచి మరో సినిమా రెడీ అయింది. దాని పేరు లక్ష్య. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లవ్, యాక్షన్, ఫ్రెండ్ షిప్ లాంటి ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించారు. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

ట్రయిలర్ లో పార్థు అనే పాత్రలో కనిపించాడు నాగశౌర్య. ఆర్చరీ అంటే అతడికి ప్రాణం. అతడంటే రితిక (కేతిక శర్మ)కు ప్రాణం. వీళ్లిద్దరి మధ్యలో ఓ ఫ్రెండ్ కూడా ఉంటాడు. వాడు చేసిన తప్పు వల్ల పార్థు కెరీర్ ఎలా నాశనం అయిందనే స్టోరీని లక్ష్యలో అంతర్లీనంగా చూపించారు.

సినిమాలో ఎయిట్ ప్యాక్ లో కనిపించాడు నాగశౌర్య. అతడి ఎయిట్ ప్యాక్ లుక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇక కేతిక శర్మ ఎప్పీయరెన్స్ కూడా బాగుంది. ట్రయిలర్ చూస్తుంటే.. 5-6 లేయర్స్ తో కథను అల్లుకున్నట్టు కనిపిస్తోంది. కాళభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లక్ష్యకు కలిసొచ్చేలా ఉంది. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది లక్ష్య మూవీ.

Full View

Tags:    
Advertisement

Similar News