రిపబ్లిక్ కోసం సాయితేజ్ ఆడియో ప్రచారం
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో! వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ‘జీ 5’ ఓటీటీ వేదిక… […]
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!
వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ‘జీ 5’ ఓటీటీ వేదిక… ‘రిపబ్లిక్’ సినిమాను డైరెక్టర్ కామెంటరీతో విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అంటే, కేవలం సినిమా చూసి ఆనందించడమే కాకుండా.. ఆ సినిమా సన్నివేశాల్ని దర్శకుడు వివరించే వీడియోలు కూడా చూడొచ్చన్నమాట.
జీ5లో తన కొత్త సినిమా స్ట్రీమింగ్ కు రాబోతున్న సందర్భంగా సాయి తేజ్ ఓ ఆడియో మెసేజ్ పంపించారు. అందులో ఆయన మాట్లాడుతూ “హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. ‘జీ 5’ ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి… మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్” అని అన్నారు.
రోడ్డు యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయితేజ్ ఇప్పటివరకు బయటకు రాలేదు. అందుకే రిపబ్లిక్ ఓటీటీ రిలీజ్ ప్రమోషన్ కు కూడా ఆయన బయటకురాలేదు. మరికొన్నాళ్లు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత నేరుగా సెట్స్ పైకి రావాలనే ఆలోచనలో ఉన్నాడు సాయితేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా, కార్తీక్ దండు దర్శకత్వంలో సాయితేజ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.