డిసెంబర్ లో నాగశౌర్య సినిమా

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్య. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. వరుడు కావలెను తర్వాత నాగశౌర్య నుంచి రాబోతున్న సినిమా ఇదే. విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగశౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కుపెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్క వర్షం […]

Advertisement
Update:2021-11-24 12:56 IST

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్య. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 10న విడుదల కానుంది. వరుడు కావలెను తర్వాత నాగశౌర్య నుంచి రాబోతున్న సినిమా ఇదే.

విడుదల తేదీని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగశౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కుపెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్క వర్షం కూడా పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పెంచేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది.

విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇదివరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తాడు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News