ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్ రెడీ

ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్ రాబోతోందనే న్యూస్ 3 రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూడో పాటకు సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదొక ఎమోషనల్ సాంగ్ అనే విషయాన్ని బయటపెట్టారు. ఆర్ఆర్ఆర్ మూడో సాంగ్ కు సోల్ ఏంథెమ్ అనే పేరు పెట్టారు. ఎమోషనల్ సాంగ్స్ కు పెట్టింది పేరు కీరవాణి. అలాంటి మ్యూజిక్ డైరక్టర్ నుంచి, అతడి పుట్టినరోజు కానుకగా 26వ తేదీన ఈ […]

Advertisement
Update:2021-11-23 08:22 IST

ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్ రాబోతోందనే న్యూస్ 3 రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూడో పాటకు సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదొక ఎమోషనల్ సాంగ్ అనే విషయాన్ని బయటపెట్టారు. ఆర్ఆర్ఆర్ మూడో సాంగ్ కు సోల్ ఏంథెమ్ అనే పేరు పెట్టారు.

ఎమోషనల్ సాంగ్స్ కు పెట్టింది పేరు కీరవాణి. అలాంటి మ్యూజిక్ డైరక్టర్ నుంచి, అతడి పుట్టినరోజు కానుకగా 26వ తేదీన ఈ సోల్ యాంథెమ్ రాబోతోంది. దీనికి సంబంధించి యూనిట్ మరో చిన్న క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది లిరికల్ వీడియో కాదు. అంటే, ఫొటోలపై టెక్స్ట్ వేసి రిలీజ్ చేసే పాట కాదు. ఏకంగా వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

నాటునాటు సాంగ్ తో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అంతకంటే ముందొచ్చిన దోస్తీ సాంగ్ కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడీ సోల్ ఏంథెమ్ తో సినిమా ప్రచారం పీక్స్ కు చేరుతుందని యూనిట్ భావిస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ తర్వాత యూనిట్ నేరుగా ప్రచారంలోకి దిగనుంది. ముందుగా టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ.

Tags:    
Advertisement

Similar News