ఆర్ఆర్ఆర్ నుంచి మూడో పాట రెడీ

ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్ రెడీ అయింది. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 25న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మూడో లిరికల్ సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే దీనిపై యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఆ రోజున లిరికల్ సాంగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేస్తారా లేక మొత్తం లిరికల్ వీడియోనే రిలీజ్ చేస్తారా అనే సందేహాలు ముసురుకున్నాయి. దీనికో రీజన్ ఉంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి […]

Advertisement
Update:2021-11-20 14:00 IST

ఆర్ఆర్ఆర్ నుంచి మరో సాంగ్ రెడీ అయింది. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 25న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మూడో లిరికల్ సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే దీనిపై యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఆ రోజున లిరికల్ సాంగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేస్తారా లేక మొత్తం లిరికల్ వీడియోనే రిలీజ్ చేస్తారా అనే సందేహాలు ముసురుకున్నాయి. దీనికో రీజన్ ఉంది.

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు-నాటు సాంగ్ రిలీజైంది. ఈ పాట ఇండియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సాంగ్ పై వచ్చిన రీమిక్స్ లకు కొదవలేదు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. దీని హవా మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

ఇలాంటి టైమ్ లో మూడో సాంగ్ రిలీజ్ చేస్తే, నాటు-నాటు సాంగ్ క్రేజ్ ను యూనిట్టే కావాలని తగ్గించినట్టు అవుతుంది. అందుకే మూడో పాట విడుదలపై మల్లగుల్లాలు పడుతున్నారు. కీరవాణి స్వరపరిచిన ఆ మూడో పాట మెలొడీగా ఉంటుందనే టాక్ నడుస్తోంది.

ఎన్టీఆర్-చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు. రాజమౌళి ఈ సినిమాకు దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్ పై ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో మొదటి వారం రోజులు ఈ సినిమాను ప్రదర్శిస్తారు. ఆ మేరకు ఆల్రెడీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News