అంతం కాదిది ఆరంభం.. కేంద్రం కళ్లు తెరిపిద్దాం..

కేంద్రంపై తెలంగాణ మొదలు పెట్టిన పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఢిల్లీ వరకు వెల్లి పోరాడాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిపారాయన. ఇకనైనా కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు మానేయాలని హితవు పలికారు. పంజాబ్‌ లో లాగానే తెలంగాణలో కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. […]

Advertisement
Update:2021-11-18 08:30 IST

కేంద్రంపై తెలంగాణ మొదలు పెట్టిన పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఢిల్లీ వరకు వెల్లి పోరాడాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిపారాయన. ఇకనైనా కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు మానేయాలని హితవు పలికారు. పంజాబ్‌ లో లాగానే తెలంగాణలో కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 50 రోజులుగా అనేక రూపాల్లో వినతులు చేస్తున్నా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని, తాను లేఖ రాసినా కూడా ప్రధాని నిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసే వరకు గ్రామగ్రామల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన చేపట్టకూడదా..?
ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిపిన ధ‌ర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారని, ఆ సందర్భంగా కొంతమంది వితండవాదం చేశారని, ప్రభుత్వమే ధర్నాకు దిగడమేంటని అడిగారని గుర్తు చేశారు కేసీఆర్. 2006లో గుజ‌రాత్ సీఎం హోదాలో నరేంద్ర మోదీ 51 గంటలు దీక్ష చేయలేదా అని ప్రశ్నించారు కేసీఆర్. ప్రధాని అయిన తర్వాత మోదీ ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి ఇతరులకు కల్పించారని ఎద్దేవా చేశారు. సీఎంలు, మంత్రులు ధ‌ర్నాలో కూర్చునే ప‌రిస్థితి మోదీ విధానాల వ‌ల్లే వ‌చ్చిందని విమర్శించారు.

పోరాటం చేసి తెలంగాణ‌ను సాధించుకున్నామని, రైతులకోసం ఇప్పుడు మరో పోరాటం మొదలు పెట్టామని అన్నారు కేసీఆర్. తెలంగాణ పోరాటాల గ‌డ్డ‌, విప్ల‌వాల గ‌డ్డ‌ అని, త‌న‌ను తాను ర‌క్షించుకోవడం తెలంగాణకు తెలుసని చెప్పారు. తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిన కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు, కేంద్రం కళ్లు తెరిపించేందుకు యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు కేసీఆర్. ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, కళాకారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News