అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్

ఫ్లాప్ అయిన సినిమాలు వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. గతంలో కొన్ని సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రొమాంటిక్ కూడా చేరిపోయింది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన యాక్ష‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రొమాంటిక్‌’ న‌వంబ‌ర్ 26న ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అందించారు. అనీల్ […]

Advertisement
Update:2021-11-17 15:25 IST

ఫ్లాప్ అయిన సినిమాలు వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. గతంలో కొన్ని సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రొమాంటిక్ కూడా చేరిపోయింది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది.

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన యాక్ష‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రొమాంటిక్‌’ న‌వంబ‌ర్ 26న ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అందించారు. అనీల్ పడూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌ల‌తో పాటు సూప‌ర్బ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ నటించింది. వీటితో పాటు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, షార్ప్ స్క్రీన్‌ప్లే, సునీల్ క‌శ్య‌ప్ సంగీతం హైలెట్ అంటూ ప్రచారం చేసుకుంటోంది ఆహా యాప్.

‘రొమాంటిక్’ సినిమా ప్రేక్ష‌కుల‌కు గోవాలోని వాస్కోడిగామా అనే 21 ఏళ్ల కుర్రాడి క‌థ‌. గోవాలో జ‌రిగే నేరాల‌కు పోలీసులు వ‌ల్ల‌ అత‌న్ని ఇబ్బంది ప‌డుతుంటాడు కూడా. వాస్కోడిగామా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఓ మంచి జీవితాన్ని గ‌డ‌పాల‌ని అత‌ని స‌ల‌హాలు ఇస్తుంటారు. కానీ అత‌ని జీవితంలో స‌మ‌స్య‌లే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. త‌నొక గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారుతాడు. పోలీస్ ఆఫీస‌ర్ చెల్లెలు మోనిక‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రివి విరుద్ధ‌మైన ప్ర‌పంచాలు అయినా కూడా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఏసీపీ ర‌మ్యా గోవార్క‌ర్ వారి ప్రేమ‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి వ‌స్తుంది.

Tags:    
Advertisement

Similar News