పుష్ప కోసం రంగంలోకి దిగిన లైకా

పుష్ప సినిమాతో ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా హీరో అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు అల్లు అర్జున్. సౌత్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, నార్త్ లో కూడా పుష్ప సినిమాతో క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఈ మేరకు ఉత్తరాది రిలీజ్ కు సంబంధించి లైన్ క్లియర్ చేసిన బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేశాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థతో కలిశాడు. అవును.. తమిళనాట పుష్ప సినిమాను లైకా ప్రొడక్షన్స్ […]

Advertisement
Update:2021-11-17 15:50 IST

పుష్ప సినిమాతో ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా హీరో అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు అల్లు అర్జున్. సౌత్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, నార్త్ లో కూడా పుష్ప సినిమాతో క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఈ మేరకు ఉత్తరాది రిలీజ్ కు సంబంధించి లైన్ క్లియర్ చేసిన బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేశాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థతో కలిశాడు.

అవును.. తమిళనాట పుష్ప సినిమాను లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేయబోతోంది. ఈ సంస్థకు కోలీవుడ్ కు మంచి నెట్ వర్క్ ఉంది. ఏ సినిమాకైనా భారీ రిలీజ్ కావాలంటే లైకాను ఆశ్రయించాల్సిందే. ఇప్పుడు పుష్ప యూనిట్ కూడా అదే పని చేసింది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కోలీవుడ్ రిలీజ్ గా రాబోతోంది పుష్ప.

తెలుగు థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించి ఇప్పటికే అన్నీ సెట్ చేసి పెట్టారు. మలయాళంలో ఆల్రెడీ బన్నీకి క్రేజ్ ఉంది కాబట్టి, అక్కడ కూడా రికార్డ్ స్థాయిలో థియేటర్లు దక్కాయి. సో.. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా రాబోతోంది పుష్ప సినిమా. ఈ మూవీ కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు బన్నీ. ఈ నెలాఖరు నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాడు. సుకుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. సమంత ఐటెంసాంగ్ చేయబోతోంది.

Tags:    
Advertisement

Similar News