అనుభవించు రాజా ట్రయిలర్ రివ్యూ
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’.. అనే డైలాగ్‌తో […]
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
‘రూపాయి పాపాయిలాంటిదిరా.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 115 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో రాజ్ తరుణ్ పాత్రలోని రెండు కోణాలను చూపించారు. సిటీలో సెక్యురిటీ గార్డ్, ఊర్లో జాలీగా ఎంజాయ్ చేసే బంగారం పాత్రలో రాజ్ తరుణ్ మెప్పించారు. బంగారం గాడి లాంటి మనసు సినిమా హాల్ లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటది.. పోతా ఉంటది.. ఏదీ పర్మనెంట్‌గా ఉండదు.. అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో పాత్ర స్వరూపం ఏంటో అర్థమవుతుంది. ఈ చిత్రంలో కశిష్ ఖాన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనుంది.
దర్శకుడు శ్రీను గవిరెడ్డి అద్బుతమైన కథకు, మంచి మాటలు రాసుకున్నట్టు కనిపిస్తోంది. ట్రైలర్‌లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్స్‌లో కనిపిస్తున్నాయి. నాగేష్ బానెల్ కెమెరావర్క్‌తో ట్రైలర్ నిండుగా కనిపించింది. గోపీ సుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంది. మొత్తంగా ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నవంబర్ 26న అనుభవించు రాజా థియేటర్లోకి రాబోతోంది.