రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ అదిరింది
చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధేశ్యామ్“. ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా స్పెషల్ క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నాడు. ఇది గొప్ప ప్రేమకథ అని మోషన్ పోస్టర్ తోనే రివీల్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ పాటను మరో టాప్ మ్యూజిక్ డైరక్టర్ […]
చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధేశ్యామ్“. ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా స్పెషల్ క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నాడు. ఇది గొప్ప ప్రేమకథ అని మోషన్ పోస్టర్ తోనే రివీల్ అయ్యింది.
తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ పాటను మరో టాప్ మ్యూజిక్ డైరక్టర్ యువన్ శంకర్ రాజా, హరిణితో కలిసి పాడాడు. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇలా రిలీజైన వెంటనే అలా హిట్ అయింది ఈ సాంగ్. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్-2 లో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు, ఇప్పటికే 55 లక్షలకు పైగా వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఆమధ్య విడుదలైన విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధేశ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నాడు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది రాధేశ్యామ్ మూవీ.