మైక్ టైసన్ తో రౌడీ ఫైటింగ్

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ లైగర్. ఈ చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. మైక్ టైసన్ పంచ్‌లోని పవర్ అందరికీ తెలిసిందే. అలాంటి మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నాడు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. […]

Advertisement
Update:2021-11-16 14:12 IST

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ లైగర్. ఈ చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. మైక్ టైసన్ పంచ్‌లోని పవర్ అందరికీ తెలిసిందే. అలాంటి మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నాడు.

విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. షూటింగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌లు నవ్వుతూ కనిపించారు. కానీ ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ అని చెబితే మాత్రం సీన్ మారిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్‌ అంచనాలు మించేలా ఉంటాయి.

“ఒకరికొకరు వారు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే.. ది లెజెండ్ వర్సెస్ లైగర్ ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు” అంటూ చిత్రయూనిట్ తెలిపింది. “మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మెమోరీస్‌గా గుర్తు పెట్టుకుంటున్నాను. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు.

లైగర్ షూట్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News