స్టార్ హీరోని కొడితే రూ. లక్ష బహుమానం.. సంచలనం సృష్టిస్తున్న పీఎంకే ప్రకటన..!

యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం తోపాటు పలు వివాదాలకు దారితీస్తోంది. తొలుత ఈ సినిమాలో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిపై ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చెయ్యి చేసుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఆ సీన్ సినిమాకు అవసరమే లేదని, హిందీ భాషను కించపరచడం కోసమే ఇలా చేశారని పలువురు విమర్శించారు. తాజాగా జైభీమ్ సినిమా రెండు వివాదాల్లో చిక్కుకుంది. జై భీమ్ సినిమాలో ఉన్న ఓ […]

Advertisement
Update:2021-11-15 12:53 IST

యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం తోపాటు పలు వివాదాలకు దారితీస్తోంది. తొలుత ఈ సినిమాలో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిపై ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చెయ్యి చేసుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఆ సీన్ సినిమాకు అవసరమే లేదని, హిందీ భాషను కించపరచడం కోసమే ఇలా చేశారని పలువురు విమర్శించారు.

తాజాగా జైభీమ్ సినిమా రెండు వివాదాల్లో చిక్కుకుంది. జై భీమ్ సినిమాలో ఉన్న ఓ మతపరమైన చిహ్నంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒక కమ్యూనిటీని కించపరిచిన జై భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడులో ప్రధాన పార్టీ అయిన పీఎంకే డిమాండ్ చేసింది. అలాగే ఈ విషయమై హీరో సూర్యను కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం ఇస్తామని ఆ పార్టీ ప్రకటించడం తమిళ నాట సంచలనంగా మారింది. కాగా పీఎంకే నేతల తీరుపై సూర్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జైభీమ్ చిత్ర యూనిట్ కు తమిళనాడు వన్నియార్ సంఘం షాక్ ఇచ్చింది. చిత్రంలోని కొన్ని సంఘటనలు తమ వర్గాన్ని కించపరిచేలా, పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్ర యూనిట్‌కు, హీరో సూర్యకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

జై భీమ్ చిత్ర నిర్మాతలు వన్నియార్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కలిగించేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రూ.5 కోట్ల నష్టపరిహారం కూడా కోరారు. సినిమాలో వాస్తవ సంఘటనలోని నిజమైన పాత్రల అసలు పేర్లను చేర్చారని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐ పేరును వన్నియార్ కులానికి చెందిన వ్యక్తి పేరు పెట్టారని ఆ సంఘ నాయకులు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News