కొత్త సినిమా లాంఛ్ చేసిన బాలయ్య

బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్‌ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు మలినేని. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ […]

Advertisement
Update:2021-11-13 13:48 IST

బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్‌ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు మలినేని. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నాడు.

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. #NBK107 అంటూ వర్కింగ్ టైటిల్‌‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌. సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

Tags:    
Advertisement

Similar News