నాటు నాటుగా ఆర్ఆర్ఆర్ సాంగ్

ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు రామ్ చరణ్ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడు. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో చిందేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడా టైమ్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ నుంచి ఊర మాస్ సాంగ్ రిలీజైంది. నాటు నాటు అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ తమ డాన్స్ తో మెస్మరైజ్ చేశారు. పేరుకు ఇది లిరికల్ వీడియోనే కావొచ్చు కానీ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, ఎన్టీఆర్, చరణ్ కలిసి […]

Advertisement
Update:2021-11-10 14:16 IST

ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు రామ్ చరణ్ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడు. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో చిందేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడా టైమ్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ నుంచి ఊర మాస్ సాంగ్ రిలీజైంది. నాటు నాటు అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ తమ డాన్స్ తో మెస్మరైజ్ చేశారు.

పేరుకు ఇది లిరికల్ వీడియోనే కావొచ్చు కానీ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, ఎన్టీఆర్, చరణ్ కలిసి డాన్స్ చేసిన 2 స్టెప్స్ ను ఇందులో చూపించారు. దీంతో నాటు-నాటు సాంగ్ హాట్ టాపిక్ అయిపోయింది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత మాస్ గా ఉందో, దానికి చెర్రీ-తారక్ వేసిన స్టెప్పులు కూడా అంతే మాస్ గా ఉన్నాయి.

చంద్రబోస్ రాసిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ డాన్స్ మూమెంట్స్ అందించాడు. కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటను ఆలపించారు. తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళం భాషల్లో రిలీజైన ఈ నాటు సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News