మేజర్ వచ్చేది వచ్చే ఏడాదే!

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ మూవీని ఈ నెల లేదా డిసెంబర్ లో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడంతో, వచ్చే ఏడాదికి మూవీ పోస్ట్ పోన్ […]

Advertisement
Update:2021-11-09 10:17 IST

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ మూవీని ఈ నెల లేదా డిసెంబర్ లో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడంతో, వచ్చే ఏడాదికి మూవీ పోస్ట్ పోన్ అయింది.

3 భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఈ వీడియోలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జర్నీ, ప్రేమ అన్నీ చూపించారు. టీనేజ్ కుర్రాడి నుంచి ధైర్యసాహసాలు కలిగిన సైనికుడిగా మారిన విధానం చూపించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా ఉంటాయి.

శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Tags:    
Advertisement

Similar News