కొత్త సినిమాలో కీర్తిసురేష్ పాత్ర ఇదే

గుడ్ లక్ సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది హీరోయిన్ కీర్తిసురేష్. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటి? దీనిపై వెరైటీగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కీర్తిసురేష్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా సినిమాలో ఓ పాట ఉంది. ఆ పాటను విడుదల చేశారు. ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె […]

Advertisement
Update:2021-11-09 10:30 IST

గుడ్ లక్ సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది హీరోయిన్ కీర్తిసురేష్. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటి? దీనిపై వెరైటీగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కీర్తిసురేష్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా సినిమాలో ఓ పాట ఉంది. ఆ పాటను విడుదల చేశారు.

ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె ఐరెన్ లెగ్ ఎలాంటిదో సరదాగా చూపించారు. ఈ స్పోర్ట్స్ రొమాంటింక్ కామెడీ డ్రామా సినిమాలో కీర్తిసురేష్ పల్లెటూరి పిల్లగా ఎంతో చక్కగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేయగా.. శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. హరిప్రియ, సమీర భరద్వాజ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ కలిసి పాడారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తున్నాడు. ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. నవంబర్ 26న ఈ చిత్రం విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News