బంగార్రాజు షూటింగ్ అప్ డేట్స్

జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నాగార్జున. బంగార్రాజు సినిమాను ఇలా లాంఛ్ చేసి అలా షూటింగ్ పూర్తిచేస్తున్నాడు. ఓవైపు షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూనే, మరోవైపు లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తున్నాడు. ఎలాగైనా సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నాడు. ఇన్నాళ్లూ రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు మైసూర్ కు షిఫ్ట్ అయింది. మైసూర్ లోని కొన్ని లొకేషన్లలో సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. […]

Advertisement
Update:2021-11-09 10:24 IST

జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నాగార్జున. బంగార్రాజు సినిమాను ఇలా లాంఛ్ చేసి అలా షూటింగ్ పూర్తిచేస్తున్నాడు. ఓవైపు షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూనే, మరోవైపు లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తున్నాడు. ఎలాగైనా సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నాడు.

ఇన్నాళ్లూ రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు మైసూర్ కు షిఫ్ట్ అయింది. మైసూర్ లోని కొన్ని లొకేషన్లలో సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 50శాతానికి పైగా పూర్తవుతుంది. డిసెంబర్ చివరి నాటికి టోటల్ షూటింగ్ పూర్తిచేసి, జనవరి ఫస్ట్ వీక్ కు ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతి షెట్టి హీరోయిన్లు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతోంది బంగార్రాజు. కుదిరితే సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాలనేది నాగ్ ఆలోచన. ఒకవేళ సంక్రాంతికి థియేటర్లు దొరక్కపోతే.. జనవరి 26న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అన్నపూర్ణ స్టుడియోస్, జీ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

Full View

Tags:    
Advertisement

Similar News