రామారావు ఆన్ డ్యూటీ అప్ డేట్స్

వరుసగా సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఏ సినిమాను పక్కన పెట్టలేదు. ప్రతి సినిమాకు మినిమం గ్యాప్స్ లో కాల్షీట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా మరోసారి కాల్షీట్లు కేటాయించాడు. ఈ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ […]

Advertisement
Update:2021-11-08 11:49 IST

వరుసగా సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఏ సినిమాను పక్కన పెట్టలేదు. ప్రతి సినిమాకు మినిమం గ్యాప్స్ లో కాల్షీట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా మరోసారి కాల్షీట్లు కేటాయించాడు. ఈ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించబోతోంది యూనిట్. అక్కడ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సాంగ్స్ కోసం విదేశాలకు వెళ్తారు.

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. అతడి పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు స్యామ్‌ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

Tags:    
Advertisement

Similar News