పాటలతో బంగార్రాజు ప్రచారం
నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను రేపు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన […]
నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను రేపు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు.
సోగ్గాడే చిన్నినాయన సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ప్రీక్వెల్ కు కూడా అతడ్నే తీసుకున్నారు. ‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.