విజయ్ దేవరకొండ లవ్ ఫెయిల్యూర్
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇతడే. అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది ఈ హీరోకి. ఇలాంటి వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ బయటపెట్టాడు. పుష్పక విమానం అనే సినిమా చేశాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా ప్రమోషన్ కోసం తమ్ముడితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో […]
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇతడే. అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది ఈ హీరోకి. ఇలాంటి వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ బయటపెట్టాడు.
పుష్పక విమానం అనే సినిమా చేశాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా ప్రమోషన్ కోసం తమ్ముడితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇద్దరూ కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా అని అడిగాడు ఆనంద్. దీనికి విజయ్ విచారంగా మొహం పెట్టాడు.
ప్రస్తుతం తనకు హార్ట్ బ్రేక్ అయిందని, చాలా బాధలో ఉన్నానని, మరో అమ్మాయితో డేటింగ్ చేసే మూడ్ లో లేనని ఆన్సర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. దీంతో అవాక్కవ్వడం ఆనంద్ వంతయింది.
విజయ్ దేవరకొండ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడనే టాక్ ఉంది. పైగా అతడికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే విషయాన్ని ఆనంద్ దేవరకొండ ఇప్పటికే బయటపెట్టాడు. కాబట్టి ఆ గ్యాంగ్ లో ఒకమ్మాయి, విజయ్ హార్ట్ బ్రేక్ చేసి ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు.