ఆచార్య నుంచి మెలొడీ సాంగ్

ఆచార్య సినిమా ఈ ఏడాది విడుదల కాదు. సంక్రాంతికి కూడా సినిమా రాదు. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్ జోరు కూడా తగ్గించారు. లెక్కప్రకారం ఈపాటికే 3 సింగిల్స్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో నిదానంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చారు. ఆచార్య సినిమా నుంచి లాహె..లాహె సాంగ్ రిలీజై చాలా రోజులైంది. […]

Advertisement
Update:2021-11-02 17:03 IST

ఆచార్య సినిమా ఈ ఏడాది విడుదల కాదు. సంక్రాంతికి కూడా సినిమా రాదు. ఈ విషయాన్ని మేకర్స్ కూడా ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్ జోరు కూడా తగ్గించారు. లెక్కప్రకారం ఈపాటికే 3 సింగిల్స్ రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో నిదానంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చారు.

ఆచార్య సినిమా నుంచి లాహె..లాహె సాంగ్ రిలీజై చాలా రోజులైంది. యూట్యూబ్ రికార్డులు తిరగరాయకపోయినా, అందర్నీ బాగానే ఆకట్టుకుంది ఆ పాట. మణిశర్మ కంపోజిషన్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, చిరంజీవి-సంగీత స్టెప్పులు అందర్నీ అలరించాయి. ఇప్పుడు రెండో పాటను 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో కనిపించనుంది పూజా హెగ్డే. ఆమె క్యారెక్టర్ పేరు మీదనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. నీలాంబరి లిరిక్స్ తో సాగే ఈ పాటకు మణిశర్మ అద్భుతమైన బాణీలిచ్చాడట. ఈ సాంగ్ తో అతడికున్న మెలొడీ బ్రహ్మ ఇమేజ్ మరింత పెరుగుతుందంటున్నారు. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రాబోతోంది ఆచార్య.

Tags:    
Advertisement

Similar News