పార్టీ శ్రేణులకు షాకిచ్చిన అఖిలేష్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటన..!
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అఖిలేష్ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. అఖిలేష్ సమాజ్ వాదీ పార్టీ సీఎం అభ్యర్థి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ […]
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అఖిలేష్ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.
అఖిలేష్ సమాజ్ వాదీ పార్టీ సీఎం అభ్యర్థి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే కాదు గత ఎన్నికల సమయంలో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఆయన యూపీలోని ఆజంఘడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
సోమవారం ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. ఆర్ఎల్డీతో పొత్తు ఇప్పటికే ఫైనల్ అయ్యిందని..కేవలం సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్న బాబాయ్ శివపాల్ సింగ్ నేతృత్వంలోని ప్రగతిశీల సమాజ్ వాద్ పార్టీతో కూడా ఎన్నికల పొత్తులకు తమకు ఇబ్బంది లేదని ఆయన ప్రకటించారు. శివపాల్ సింగ్ తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులకు తగిన గౌరవం ఇస్తామని చెప్పారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ ప్రకటన చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖిలేష్ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.